బోధన్: ఎడపల్లి మండల కేంద్రంలోని రైల్వేగేట్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర ప్రాంత వాసీ మృతి చెందాడని ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ మంగళవారం తెలిపారు. నాందేడ్ జిల్లా దెగ్లూర్ తాలూకా పరిధిలోని చైన్‌పూర్ గ్రామానికి చెందిన గణపతి పీరాజీ కామ్లే పాడేవార్(50), సూర్యకాంత్ లక్ష్మణ్ పాడేవార్ నాలుగేళ్ల నుంచి బాల్కొండ మండలంలోని బోదేపల్లిలో వ్యవసాయ పనులకు జీతం ఉన్నారు. సూర్యకాంత్ లక్ష్మణ్ పాడేవార్ తన యాజమాని బైక్‌పై రాఖీ పండుగకు స్వగ్రామానికి వెళ్లాడు. తిరిగి అదే బైక్‌పై బోధన్‌లో ఉన్న గణపతి పీరాజీ కామ్లే పాడేవార్‌ను వెనుక కూర్చుబెట్టుకుని బోదేపల్లి వెళ్లే క్రమంలో ఎడపల్లి రైల్వే గేట్ దాటిన తర్వాత బైక్ అదుపు తప్పి ఇద్దరు కిందపడ్డారు. గణపతి పీరాజీ కామ్లే పాడేవార్‌కు తీవ్రగాయాలు కాగా స్థానికులు అంబులెన్స్‌లో బోధన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పీరాజీ అప్పటికే మృతి చెందాడన్నారు. సూర్యకాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బంధువు గౌతం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బొలెరో, ఎక్సెల్ ఢీకొని ఒకరు..
తాడ్వాయి: బొలెరో వాహనం, ఎక్సెల్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన తా డ్వాయి మండలం ఎ ర్రపహాడ్ శివారులో మంగళవా రం చోటు చేసుకుంది. ఎ స్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎండ్రియల్ గ్రామానికి చెందిన చాకలి భీమయ్య (80) మందు ల కోసం తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ఎర్రపహాడ్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. తిరిగి గ్రామానికి వస్తుండగా తాడ్వాయి నుంచి ఎర్రపహాడ్ వైపు అతివేగంగా వస్తున్న బొలెరో వాహనం భీమయ్యను ఢీ కొన్నది. ఈ ఘటనలో అతని తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు రమాకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


