● సీపీ సాయి చైతన్య
● పెగడపల్లి గ్రామంలో
15 సీసీ కెమెరాలు ప్రారంభం
బోధన్‌రూరల్: సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామంలో పటిష్టమైన నిఘా ఉంటుందని, ఒక్కో కెమెరా 100 మంది పోలీసులతో సమానమని సీపీ సాయిచైతన్య అన్నారు. మండలంలోని పెగడపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజల భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవచ్చని, నేరాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు కూడా ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి దుకాణం, వ్యాపార సంస్థల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పెగడపల్లిలో కెమెరాల ఏర్పాటుకు సహకరించిన శాలిమార్ హ్యాచరీస్ యాజమాన్యాన్ని సీపీ అభినందించారు.విద్యార్థులు ఆకర్షణలకు లోనుకాకుండా విద్యపై దృష్టిసారించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్‌ఐ రాజశేఖర్, సర్పంచ్ రచన, శాలిమార్ హ్యాచరీస్ మేనేజర్ ఇమ్రా ముల్లా, వైస్ ప్రెసిడెంట్ పోతు రెడ్డి, ఉపసర్పంచ్ ఎండీ షబ్బీర్, విలేజ్ కమిటీ అధ్యక్షుడు సాయిబాబు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాద ఘటనాస్థలి పరిశీలన
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని బైపాస్ రోడ్డు అంబేడ్కర్ కాలనీ వద్ద గురువారం ఓ కారు బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి అక్కడే ఉన్న హోటల్ లోకి దూసుకుపోయింది. అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పట్టణ సీఐ వెంకట నారాయణను వివరాలు కోరగా ప్ర మాదం జరిగినట్లు సమాచారం ఉందని ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఈ ప్రమాదంలో ఎవరికీ గా యాలు కాలేదని సీఐ తెలిపారు. కొద్దిసేపటికి ఘటన స్థలాన్ని సీపీ సాయి చైతన్య పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, వివరాలను అడిగి తెలుసుకున్నారు.


