కేరళం రాష్ట్ర సంస్కృతికి ప్రతీక ఓనం | - | Sakshi
Sakshi News home page

కేరళం రాష్ట్ర సంస్కృతికి ప్రతీక ఓనం

Sep 4 2026 1:48 AM | Updated on Sep 4 2026 1:48 AM

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): ఓనం పండుగ కేరళం రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌ అన్నారు. మండలంలోని తిరుమల నర్సింగ్‌ కళాశాలలో గురువారం నిర్వహించిన ఓనం వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కళాశాల చైర్మన్‌ పరమేశ్వర్‌రెడ్డి, కరస్పాండెంట్‌ పద్మావతిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. తమ కళాశాలలో చదువుతున్న కేరళం విద్యార్థుల కోసం గత పదేళ్లుగా ప్రతిఏటా ఓనం పండుగను నిర్వహిస్తున్నట్లు చైర్మన్‌ పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. వేడుకల్లో విద్యార్థినులు రంగురంగుల పువ్వులతో వేసిన అందమైన రంగవల్లులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. తాహెర్‌తోపాటు పరమేశ్వర్‌రెడ్డి ఉత్సాహంగా ఉట్టి కొట్టారు. అనంతరం ‘ఓనం సాద్య’ విందును విద్యార్థులు, అతిథులు, అధ్యాకులు, సిబ్బంది ఆరగించారు. డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి విద్యార్థులకు, అధ్యాపకులకు ఓనం పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రిన్సిపాల్‌ ప్రతిభ, వినీల్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement