రాజీపడే కేసులను ముందుగా గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

రాజీపడే కేసులను ముందుగా గుర్తించాలి

Sep 1 2026 1:43 AM | Updated on Sep 1 2026 1:43 AM

ఆర్మూర్‌టౌన్‌: రాజీపడే అవకాశం ఉన్న కేసులను ముందుగానే గుర్తించి, ఇరుపక్షాలు అదాలత్‌కు హా జరయ్యేలా ప్రోత్సహించాలని జూనియర్‌ సివిల్‌ జ డ్జి సరళ రాణి పేర్కొన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని కోర్టులో ఈ నెల 12న లోక్‌అదాలత్‌ నిర్వహించను న్న నేపథ్యంలో సోమవారం పోలీస్‌ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్‌ సివిల్‌ జడ్జి మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పోలీస్‌ అధికారులు ప్రతి గ్రామంలో విస్తృత ప్రచా రం చేయాలన్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా చిన్నచిన్న వివాదాలు త్వరగా, ఉచితంగా పరిష్కారం అవుతాయని అవగాహన కల్పించాలన్నా రు. కార్యక్రమంలో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జ డ్జి భవ్యశ్రీ, సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ గట్టు గంగాధర్‌, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కుదురుపాక ప్రవీణ్‌ చందర్‌, జనరల్‌ సెక్రెటరీ పోడేటి శంకర్‌, భీమ్‌గల్‌ సీఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement