● విద్యాశాఖ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అవకాశం
● ప్రభుత్వ నిర్ణయంతో
తల్లిదండ్రుల్లో హర్షం
ఖలీల్‌వాడి: ప్రయివేట్ పాఠశాలల ఆగడాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యలను విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసేందుకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. సమస్యను ఇదివరకు సంబంధిత విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసేవారు. ప్రస్తుతం ఆన్‌లైన్ విధానం రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గోప్యంగా ఫిర్యాదుదారుల వివరాలు..
జిల్లాలో సుమారు 293 ప్రయివేటు బడులు ఉండ గా, 1.05 లక్షల మంది విద్యార్థులు వాటిలో విద్యన భ్యసిస్తున్నారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం ప డుతోందనే ఫిర్యాదులు వస్తున్నాయి. ట్యూషన్ ఫీ జుతోపాటు వివిధ రకాల పేర్లతో అదనపు రుసుములు వసూళ్లు చేస్తున్నారు. అలాగే పుస్తకాలు, యూనిఫాంల విక్రయం, ఒకే షాపులో కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడం, అర్హతలేని ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయడం పరిపాటిగా మా రింది. విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్ర యోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు చేసేదేమి లేక మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. తల్లిదండ్రులు schooledu. telangana. gov. in/ PSCMS/ వెబ్‌సైట్‌లో తమ స మస్యను నమోదు చేయడంతోపాటు అవసరమైన ఆధారాలను కూడా సమర్పించే అవకాశం ఉంటుంది. వాట్సాప్, టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చే సేందుకు చర్యలు చేపడుతోంది. ఫిర్యాదు చేసిన వా రి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెబుతోంది.
అధికారుల పరిశీలన..
ఆన్‌లైన్‌లో వచ్చిన ఫిర్యాదులను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పరిశీలించి వాస్తవాలను నిర్ధారిస్తారు. ఆ తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందిస్తారు. ఆరోపణలు నిజమని తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పాఠశాల యాజమాన్యాలకు అవసరమైన సూచనలు, హెచ్చరికలు జారీ చేయడంతో పాటు నోటీసులు అందజేస్తారు. నిబంధనల ఉల్లంఘన తీవ్రత ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటారు.


