ఇందల్వాయి/నిజామాబాద్ అర్బన్: పాంచజన్య మహాసభ కోసం జిల్లాకు వచ్చిన తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితకు సోమవారం ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఆభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి సాంప్రదాయ నృత్యాలు చేశారు. కవిత పార్టీ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు అభివాధం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ర్యాలీగా జిల్లాకేంద్రానికి బయలుదేరారు. మాధవనగర్‌లో పూజలు నిర్వహించి పాత కలెక్టరేట్‌కు చేరుకున్నారు. మహిళలు బోనాలు, బ తుకమ్మలతో స్వాగతం పలికారు. సభలో కవిత ప్రసంగింస్తుండగా కుమారుడు ఆధిత్య, భర్త అనిల్ కింద జనాల మధ్యలో కూర్చొని ఆసక్తిగా విన్నారు. చప్పుట్లు కొడుతూ సంతోష పడ్డారు.
కవిత ప్రసంగిస్తుండగా జనంతోపాటు వింటున్న భర్త, కుమారుడు.. ప్రజలతో మాట్లాడుతున్న కవిత


