మాక్లూర్/ వేల్పూర్(బాల్కొండ): మాక్లూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ, దాస్‌నగర్ వద్ద ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం ఘనంగా జాతీయ క్రీడల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమాల్లో ప్రత్యేక అధికారి స్రవంతి, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నిరూప, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి హైస్కూల్‌లో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు క్రీడా విన్యాసాలు నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


