సబ్‌స్టేషన్‌కు దారేది.. | - | Sakshi
Sakshi News home page

సబ్‌స్టేషన్‌కు దారేది..

Aug 30 2026 1:33 AM | Updated on Aug 30 2026 1:33 AM

రోడ్లపై సర్కస్‌ ఫీట్లు చేస్తున్న సిబ్బంది

రెంజల్‌: రెంజల్‌లోని సబ్‌స్టేషన్‌కు వెళ్లేందుకు సిబ్బందితో పాటు ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు దారులున్నా చిన్న పాటి వర్షం కురిస్తే రోడ్లు బురదమయంగా మారుతున్నాయి. బురద నుంచి సబ్‌స్టేషన్‌కు చేరుకోవా లంటే సర్కస్‌ ఫీట్లు చేయాల్సి వస్తోందని సిబ్బంది వాపోతున్నారు. అవసరమైన సామగ్రిని తీసుకొచ్చే వాహనాలు దిగబడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్‌స్టేషన్‌కు వచ్చేదారుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ట్రాన్స్‌కో సిబ్బంది కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement