వేల్పూర్(మెండోరా): యువత మత్తు ప దార్థాలు, గంజాయికి దూరంగా ఉండా లని ఎస్సై సుహాసిని అన్నారు. మెండో రా మండలం కొడిచర్ల గ్రామంలో శనివారం రాత్రి పోలీసు కళాజాత కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సుహాసిని మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 112కు సమాచారం ఇవ్వాలన్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ బరువు కాదు బాధ్యత అన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు.


