ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద శుక్రవారం ఓ కారు అదుపుతప్పి డివైడర్ పై కి ఎక్కింది. స్థానికులు తెలిపిన వివరా లు ఇలా.. పెర్కిట్ నుంచి ఆర్మూర్ వైపు వెళుతున్న కారు శనివారం మామిడిపల్లి చౌరస్తా వద్ద అదుపుతప్పి రోడ్డు మధ్య లో ఉన్న డివైడర్ పైకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని కారును డివైడర్ పైనుంచి పక్కకు తీశారు. కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.


