బోధన్‌రూరల్: మండలంలోని అమ్దాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, స్కూల్ బ్యాగులను బీఆర్‌ఎస్ పార్టీ బోధన్ నియోజకవర్గ ఇన్‌చార్జి అయేషా ఫాతిమా తన జన్మదినాన్ని పురస్కరించుకుని పంపిణీ చేశారు. చింతకుంట అనాథ ఆశ్రమంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసి, అన్నదానం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, మండలాల అధ్యక్షులు నర్సన్న, సంజీవ్, శ్రీరామ్, భూ మారెడ్డి, నర్సింగ్‌రావు, కౌన్సిలర్లు మౌబీన్, ముషీర్‌బాబా, నాయకులు అశోక్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తోట శ్రీనివాస్, శంకర్‌గౌడ్, గణేశ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.


