● రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు
● ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కృష్ణమూర్తి
నిజామాబాద్ రూరల్: బస్సు ప్రయాణికులు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎస్‌వీజీ కృష్ణమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చే సుకుని టికెట్లను బుక్ చేసుకోవడం ద్వారా తమకు అనుకూలమైన సమయానికి సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకోవడం వల్ల ప్ర యాణ సమయంలో ఇబ్బందులు లేకుండా, ఆల స్యం కాకుండా తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అడ్వాన్స్ టికెట్లను www. tgsrtcbus.in వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చని , రిజర్వేషన్ కౌంటర్‌లో కూడా టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం ఉందని తెలిపారు. అడ్వాన్స్ టికెట్ బుకింగ్ ద్వారా ప్రయాణికుల రద్దీని అంచనా వేసి అవసరానికి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసును నడిపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


