సర్కారు బడుల్లో సైన్స్‌ ల్యాబ్‌లు | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల్లో సైన్స్‌ ల్యాబ్‌లు

Aug 27 2026 1:24 AM | Updated on Aug 27 2026 1:24 AM

సైన్స్‌లో ప్రయోగాత్మక నైపుణ్యం

ఉమ్మడి జిల్లాలో ఎంపికై న స్కూళ్లు

ఉమ్మడి జిల్లాలో 23 స్కూళ్ల ఎంపిక

నిజామాబాద్‌కు రూ.1.36 కోట్లు, కామారెడ్డికి రూ.4.68 కోట్లు మంజూరు

15 రోజుల్లో టెండర్లు

ఖలీల్‌వాడి: సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి సైన్స్‌ విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని 23 పాఠశాలల్లో అత్యాధునిక సైన్స్‌ ల్యాబొరేటరీలు నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో స్కూల్‌కు రూ.26 లక్షల చొప్పున నిజామాబాద్‌ జిల్లాలోని ఐదు పాఠశాలలకు రూ. 1.36 కోట్లు, కామారెడ్డి జిల్లాలోని 18 స్కూళ్లకు రూ.4.68 కోట్ల నిధులు రానున్నాయి. ఈ నిధుల్లో రూ.25 లక్షలు ల్యాబ్‌రూమ్‌ నిర్మాణం, వర్క్‌స్టేషన్‌, ఫర్నిచర్‌, ఇంటర్నల్‌ ఎలక్ట్రిఫికేషన్‌తోపాటు రూ. లక్షతో ల్యాబ్‌ పరికరాల కొనుగోలు, సరఫరా, ఇన్‌స్టలేషన్‌, టెస్టింగ్‌ అండ్‌ కమిషనింగ్‌ చేయనున్నారు. టీజీఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో ఈ–టెండర్లును ఆహ్వానిస్తోంది. టెండర్లు పూర్తయిన తర్వాత 15 రోజుల్లో అగ్రిమెంట్‌ పూర్తి చేసుకొని పనులు చేయాల్సి ఉంటుంది.

ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తే 9, 10వ తరగతి విద్యార్థులకు సైన్స్‌ సబ్జెక్ట్‌లో ప్రయోగాత్మక నైపుణ్యం పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థులు ప్రయివేటు స్కూళ్లకు ధీటుగా ప్రయోగాలు చేసి సైన్స్‌పై పట్టు సాధించే అవకాశాలు ఉంటాయి.

నిజామాబాద్‌ జిల్లా

ముప్కాల్‌ కేజీబీవీ (ముప్కాల్‌)

సిరికొండ కేజీబీవీ (పెద్దవాల్గోట్‌)

ఎడపల్లి ప్రభుత్వ హైస్కూల్‌

(ఉర్దూ), నెహ్రూనగర్‌

సాలూరా ఎంపీహెచ్‌ఎస్‌(హున్సా)

ఇందల్వాయి కేజీబీవీ (ఇందల్వాయి)

కామారెడ్డి జిల్లా..

రాజంపేట్‌ ఎంపీయూఎస్‌, అరెపల్లి

బిచ్కుంద జెడ్పీహైస్కూళ్లు హస్గుల్‌,

జామామసీద్‌ హైస్కూల్‌,

కేజీబీవీ, బిచ్కుంద

లింగంపేట్‌ జెడ్పీహైస్కూళ్లు– భవానీపేట్‌, షేట్‌పల్లి,

పరమళ, లింగంపేట్‌

(బాలికల)

పిట్లం కేజీబీవీ, పిట్లం

కామారెడ్డి జెడ్పీహైస్కూళ్లు–

కామారెడ్డి ఐఎన్‌ఆర్‌,

హనుమాన్‌ మందిర్‌

హైస్కూల్‌

నాగిరెడ్డిపేట్‌ కేజీబీవీ, నాగిరెడ్డిపేట్‌

బాన్సువాడ జెడ్పీహైస్కూళ్లు–తడ్కోల్‌,

హన్మాజీపేట్‌

నిజాంసాగర్‌ కేజీబీవీ, నిజాంసాగర్‌

డోంగ్లీ జడ్పీ హైస్కూల్‌, డోంగ్లీ

గాంధారి జెడ్పీ హైస్కూల్‌,

పోతంగల్‌ కమాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement