నిజామాబాద్ అర్బన్: గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటన నేపథ్యంలో కలెక్టర్ భవేశ్‌మి శ్రా, పోలీస్ కమిషనర్ పి సాయిచైతన్య సో మవారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. గవర్నర్ పర్యటించనున్న ప్రతి చోట పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్, సీపీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ప్రొటోకాల్ ను పాటించాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, మెడికల్ టీం, 108, 104, ప్రత్యేక డాక్టర్ల బృందాలను అందుబాటులో ఉంచాలని, వేదిక, సీటింగ్‌ను సరి చూసుకోవాలని, తాగునీరు, శానిటేషన్ పక్కా గా ఉండాలని సంబంధిత అధికారులకు బా ధ్యతలు పురమాయించారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే గవర్నర్ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు అనుమతిస్తామని సీపీ అన్నారు.


