● మహిళా సంఘాలకు
పీఎంఎఫ్‌ఎంఈ రుణాలు
● డీపీఎం రాచయ్య
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): మహిళలు చిరు వ్యాపా రాలతో స్వయం ఉపాధి పొందాలని డీపీఎం రాచ య్య సూచించారు. మహిళా సంఘాల సభ్యుల కు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రా సెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (పీఎం ఎఫ్‌ఎంఈ) పథకం ద్వారా ఆహార ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ తదితర చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీపై రుణాలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన భీమ్‌గల్ మండల సమాఖ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీఎంఎఫ్‌ఎంఈ రుణాలకు 35 శాతం వరకు సబ్సిడీ ఉంటుందని వివరించారు. మహిళలు పప్పులు, పిండి పదార్థాలు, పచ్చళ్లు, మసాలా దినుసులు, చిరుధాన్యాల ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాల తయారీ వంటి చిన్న వ్యాపారాలను ప్రారంభించి స్వయం ఉపాధి పొందవచ్చని సూచించారు. అనంతరం మహిళా సమాఖ్య సభ్యుల ఆధ్వర్యంలో స్కూల్ యూనిఫామ్‌ల కుట్టు పనులను పరిశీలించారు. ఐకేపీ ఏపీఎం ప్రమీల, సీసీలు కుంట శ్రీనివాస్, వి. శ్రీనివాస్, రఘుపతి, గంగ సాయిలు, భాస్కర్, గంగాధర్, సుమలత, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు.


