సర్పంచుల సమస్యలు పరిష్కరిస్తా.. | - | Sakshi
Sakshi News home page

సర్పంచుల సమస్యలు పరిష్కరిస్తా..

Aug 25 2026 1:21 AM | Updated on Aug 25 2026 1:21 AM

సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు

మునిపల్లి చిన్నసాయిరెడ్డి

నిజామాబాద్‌ రూరల్‌: సర్పంచుల సమస్యలను పరిష్కరిస్తూ, అందరిని కలుపుకొని ముందుకు వెళ్తానని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి చిన్నసాయిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని సర్పంచ్‌లకు, 32 మండలాల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులకు ఎలాంటి సమాచా రం ఇవ్వకుండా ఓ వ్యక్తి తానే జిల్లా సర్పంచు ఫో రం అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం పూర్తిగా అవాస్తవమని అన్నారు. సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుల అభిప్రాయాలు, సమన్వయం లేకుండా స్వయంగా జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం సరైన విధా నం కాదని స్పష్టంచేశారు. ఫోరం ప్రతినిధులు మా ట్లాడుతూ మునిపల్లి సాయిరెడ్డికి జిల్లాలోని అన్ని మండలాల సర్పంచ్‌ల మద్దతు ఉందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రి సీతక్క, జిల్లా ప్రజాప్రతినిధులు జీపీల సమస్యలు, సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దృష్టి సారించి, వా టి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారని పే ర్కొన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అరికెల జనార్దన్‌, ఉపాధ్యక్షులు చింతం ఉమారాణి సంజీవ్‌, మండలాల అధ్యక్షులు వాసు, సుదర్శన్‌, భూమేశ్‌, శ్రీను, జలేందర్‌, రాజు, మోహన్‌, నీలి మా సాయగౌడ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement