క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Aug 25 2026 1:21 AM | Updated on Aug 25 2026 1:21 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండలం బీబీపూర్‌ తండా గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్సై మహమ్మద్‌ ఆరీఫ్‌ తెలిపారు. డిచ్‌పల్లి ఖిల్లా గ్రామానికి చెందిన నాయికిడి నరేశ్‌(30) తన మిత్రుడితో కలిసి ఆదివారం సాయంత్రం పని నిమిత్తం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. రాత్రి సుమారు 12.30 గంటలకు తిరిగి బైక్‌పై వస్తుండగా బీబీపూర్‌ తండా సమీపంలోని దాబా యూటర్న్‌ వద్ద హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన నరేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చెరువులో పడి యువకుడు ..

నవీపేట: మండలంలోని బినోలా గ్రామానికి చెందిన పాతర్ల మోహన్‌ (30) అనే యువకుడు చెరువు లో పడి మృతి చెందిట్లు ఎస్సై శ్రీకాంత్‌ సోమవారం తెలిపారు. కొంత కాలంగా మోహన్‌ మద్యానికి బానిస కావడంతో భార్య లాస్య వేరుగా ఉంటుందని పేర్కొన్నారు. ఆదివారం చెరు వుగట్టుపై మద్యం సేవిస్తూ కనబడిన మోహన్‌ సోమవారం చెరువులో పడి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి కుమార్తె ఉన్నట్లు పేర్కొన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

విద్యుదాఘాతంతో ఆవు మృత్యువాత

ధర్పల్లి: విద్యుదాఘాతానికి ఒక ఆవు మృతి చెందగా, మరో ఆవుకు తీవ్రగాయాలైన ఘటన మండలంలోని దుబ్బాక గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కూర నరసయ్యకు చెందిన ఆవులు మేతకు వెళ్లి ఇంటికి వస్తున్న క్రమంలో స్తంభానికి ఉన్న సపోర్ట్‌ వైర్‌కు విద్యుత్‌ ప్రవహించడంతో విద్యుదాఘాతానికి గురయ్యాయి. ఆవు విలువ రూ.50 వేల వరకు ఉంటుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement