బెటాలియన్‌ కమాండెంట్‌ బదిలీ | - | Sakshi
Sakshi News home page

బెటాలియన్‌ కమాండెంట్‌ బదిలీ

Aug 25 2026 1:21 AM | Updated on Aug 25 2026 1:21 AM

డిచ్‌పల్లి: రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ ఏడో బెటాలియన్‌ కమాండెంట్‌ పి.సత్యనారాయణ ఇంటెలిజెన్స్‌ విభాగానికి బదిలీ అయ్యారు. సోమవారం సాయంత్రం బెటాలియన్‌ అధికారులు, సిబ్బంది కమాండెంట్‌ సత్యనారాయణకు ఘనంగా వీడ్కోలు పలికారు. తొలుత బెటాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్‌గా వచ్చిన సత్యనారాయణ మే నెలలో కమాండెంట్‌గా పదోన్నతి పొందారు. కమాండెంట్‌ సత్యనారాయణ దంపతులను సిబ్బంది ఘనంగా సత్కరించారు. అనంతరం సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. ఆయన స్థానంలో ఏడో బెటాలియన్‌ ఇన్‌చార్జి కమాండెంట్‌గా పీజేపీసీ ఛటర్జీ (17వ బెటాలియన్‌ కమాండెంట్‌) నియామకయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement