బోధన్ రూరల్: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం, గ్రామాల అభివృద్ధి, ప్రజల సుఖసంతోషాలను కాంక్షిస్తూ మల్లారం గుట్ట లింగేశ్వర ఆశ్రమానికి మండలంలోని కల్దుర్కి, రాంపూర్, ఖండ్‌గావ్, సిద్ధాపూర్ గ్రామాలకు చెందిన భక్తులు పాదయాత్ర చేపట్టారు. ఆదివారం ఎరాజ్‌పల్లి గ్రామ కమాన్ వద్దకు చేరుకున్న భక్తులకు విజయలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్ యాజమాన్యం ఆధ్వర్యంలో అల్పాహారం అందించారు. భక్తులకు సేవ చేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందని దాతలు బొందుగుల శ్రీనివాస్ గుప్తా, నాగరాజు గుప్తా, వెంకటేషం గుప్తా తెలిపారు. అల్పాహారం అందించిన దాతలను గ్రామస్తులు శాలువాలతో సత్కరించి అభినందించారు. శివభక్తులు, భజన మండలి మ హిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


