జలసిరితో భూగర్భ జలాలు వృద్ధి | - | Sakshi
Sakshi News home page

జలసిరితో భూగర్భ జలాలు వృద్ధి

Aug 24 2026 1:31 AM | Updated on Aug 24 2026 1:31 AM

నందిపేట్‌: వర్షపు నీటిని వృథా చేయకుండా జలసిరితో భూగర్భ జలాలను వృద్ధి చేయాలని నందిపేట సర్పంచ్‌ ఎర్రం లింగం అన్నారు. మండల కేంద్రంలోని రాజనగర్‌ దుబ్బా ప్రాంతంలోని వస తి గృహం వద్ద వెర్టికల్‌ సోక్‌ పిట్‌ పనులను ఆదివారం ప్రారంభించారు. వెరిక్టర్‌ సోక్‌ పిట్‌ ఏర్పాటు చేయడం ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడతాయని అన్నారు. భవిష్యత్తులో నీటి సంరక్షణకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ వాసరి రాంచందర్‌, వార్డు సభ్యులు కాంతం చిన్నయ్య, చింత శ్రీనివాస్‌, నాయకులు భాస్కర్‌, గంగన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement