ఎలాంటి ఖర్చు లేదు
గర్భిణులకు సౌకర్యం
డొంకేశ్వర్ : గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులకు మెరుగైన, సురక్షితమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అమ్మ ఒడి–102’ ఉచిత వాహన సేవలు డొంకేశ్వర్ మండలంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి ఆశా వర్కర్లు గర్భిణులను ఈ ప్రత్యేక వాహనం ద్వారా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్‌సీ) ఉచితంగా తీసుకువస్తున్నారు. ఆస్పత్రికి చేరుకున్న గర్భిణులకు వైద్యాధికారులు ఉచితంగా అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు, అవసరమైన మందులు అందజేస్తున్నారు. వైద్య, రక్త పరీక్షల ప్రక్రియ పూర్తయిన తర్వాత సదరు గర్భిణులను తిరిగి అదే వాహనంలో అత్యంత సురక్షితంగా వారి సొంత ఇళ్లకు చేరవేరుస్తున్నారు.
గతంలో గ్రామాల నుంచి మండల కేంద్రంలోని ఆస్పత్రికి రావడానికి గర్భిణులు ఆటోలు, బై క్‌లపై వచ్చేవారు. ఆర్థికంగా భారం కావడమే కా కుండా ప్రయాణాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ప్రస్తుతం ‘అమ్మ ఒడి–102’ వాహన సేవలు అందుబాటులోకి రావడంతో గర్భిణులకు ప్రతీ వారం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించు కోవడం ఎంతో సులువైంది. ఊచిత రవాణా సేవలపై గర్భిణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే వాహనంలో ఆస్పత్రుల్లో డెలివరీ కోసం తీసుకెళ్లడం, బిడ్డను ప్రసవించిన అనంతరం తిరిగి ఇంటికి తీసుకొచ్చి దింపడం లాంటి సేవలు సైతం అందుతున్నాయి.
ఆటోలో వెళ్లి రావాలంటే కు దుపుల వల్ల భయంగా ఉంటుంది. ప్రభుత్వం గర్భిణు ల క్షేమాన్ని ఆలోచించి ఏ ర్పాటు చేసిన అమ్మ ఒడి వా హనాలు ఎంతో మేలు చేస్తున్నాయి. ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా ప్ర యాణించి వారం వారం వైద్య పరీక్షలు చేయించు కుంటున్నాం. – తొగరి మనుష, గర్భిణి, అన్నారం
ప్రభుత్వం ప్రవేశపెట్టిన అ మ్మ ఒడి ఉచిత వాహన సే వలతో గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది గర్భిణులు పరీక్షలు చేయించుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ వారికి ఉచితంగా రక్త పరీక్షలు, స్కానింగ్ నిర్వహించి అవసరమైన మందులు అందజేస్తున్నాం.
– శరత్‌చంద్ర, మండల వైద్యాధికారి, డొంకేశ్వర్
గర్భిణులకు వరంగా మారిన
102 వాహన సేవలు
ఉచితంగా ఆరోగ్య కేంద్రాలకు చేరవేత
వైద్య పరీక్షల అనంతరం తిరిగి
క్షేమంగా ఇంటి వద్దకు


