ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న రైతు వేదిక ప్రాంతాన్ని ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. రైతు వేదిక ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించారు. అనంతరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతు వేదిక వద్దకు వెళ్లేందుకు సరైన మార్గం లేక పోవడంతో శుభ్రంగా చేశామన్నారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, వేద జీడి రాజ్‌కుమార్, కుకింగ్ నరేశ్, గణేశ్, రమేశ్, వేణు, కృషివర్ధన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ అంగన్‌వాడీ
టీచర్‌గా ప్రేమలత
కమ్మర్‌పల్లి(మోర్తాడ్): ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు ప్రేమలత ఉత్తమ అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జీఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసై టీ ఆధ్వర్యంలోస్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ప్రేమలత ఉత్తమ అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలిగా ప్రశంసా పత్రం అందుకున్నా రు. విధి నిర్వహణలో చిన్నారులకు, గర్భిణు లు, బాలింతలకు మెరుగైన సేవలు అందించినందుకు గాను ఈ అవార్డును అందించినట్లు తెలిపారు. ప్రేమలతకు ఈఅవార్డు రావడంపై గ్రామస్తులు, అంగన్‌వాడీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.
సీపీఎస్‌ను రద్దు చేయాలి
రుద్రూర్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ వి ధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన జన జాగరణ యాత్రకు రుద్రూర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రా ష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రం టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు ఆదివారం హైదరాబాద్‌కు బయలుదేరారు. ఎల్బీ స్టేడియంలో లక్ష మందితో నిర్వహించే భారీ బ హిరంగ సభలో పాల్గొననున్నట్లు వారు తెలిపారు. సీపీఎస్ వల్ల ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత దెబ్బతింటోందని పే ర్కొన్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కా ర్యక్రమంలో షేక్ ఈసా, అనిల్, మైముద్ అలీ, ఖదీర్, సాయిలు, వహీద్, లలిత, మంజుల తదితరులు పాల్గొన్నారు.
ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే
వేల్పూర్: అంక్సాపూర్ సంతమల్లన్న ఆలయం వద్ద ఆదివారం నిర్వహించిన ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి చెందిన తుమ్మల ప్రతీశ్‌రెడ్డి దంపతులు ఏర్పాటు చేయించిన ధ్వజస్తంభానికి ఎ మ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించగా, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రతిష్ఠించారు. అనంతరం సంతమల్లన్న స్వామిని ఎ మ్మెల్యే దర్శించుకున్నారు. కార్యక్రమంలో అంక్సాపూర్ సర్పంచ్ తీట్ల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ పాశపు రాజేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ రైతు విభాగం జిల్లా నాయకుడు మిట్టపల్లి మహిపాల్, సుంకెట పెద్దమల్లారెడ్డి, గ్రామస్తులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.


