వార్డు మెంబర్ల కమిటీ అధ్యక్షుడిగా సతీశ్‌ | - | Sakshi
Sakshi News home page

వార్డు మెంబర్ల కమిటీ అధ్యక్షుడిగా సతీశ్‌

Aug 24 2026 1:31 AM | Updated on Aug 24 2026 1:31 AM

నారింజ పండ్ల లారీ బోల్తా

వేల్పూర్‌(ముప్కాల్‌): ముప్కాల్‌ మండల వార్డు మెంబర్ల కమిటీ అధ్యక్షుడిగా కంచు సతీశ్‌ను సభ్యులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా సురేశ్‌, దీపక్‌, రాజు, ప్రధానకార్యదర్శిగా ప్రదీప్‌, కోఆర్డినేటర్లుగా రాజేశ్వర్‌, మల్లయ్య, సలహాదారులుగా సాయిలు, సవిత, అంజలి, రాజు, సభ్యులుగా సవిత, మయూర్‌, రాజు, సోని, గంగాధర్‌ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా వార్డు మెంబర్‌ కమిటీ ఇన్‌చార్జి కర్బ సాయిలు, కో ఇన్‌చార్జి సిరికొండ కల్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

రేణుకా ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి స్థలం వితరణ

వేల్పూర్‌(బాల్కొండ): బాల్కొండ మండలం చిట్టాపూర్‌ గ్రామంలో రేణుకా ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి గ్రామానికి చెందిన లింగన్న పాటిల్‌ ఆయన కుమారుడు వెంకటేశ్‌ స్థలాన్ని వితరణ చేసినట్లు బిజేపీ నాయకుడు అబ్బగోని అశోక్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆలయ నిర్మాణానికి స్థలాన్ని వితరణ చేసిన లింగన్నపాటిల్‌, వెంకటేశ్‌కు గౌడ కులస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇందల్వాయి: మండలంలోని గన్నారం గ్రామ శివారులోగల 44వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున హైదరాబాద్‌ వైపు నుంచి నాగ్‌పూర్‌ వైపు వెళ్తున్న నారింజ పండ్ల లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని ఎస్సై సుమలత తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా టోల్‌ప్లాజా సిబ్బంది సహకారంతో లారీని తొలగించినట్లు ఎస్సై తెలిపారు.

ఘనంగా తీజ్‌ ఉత్సవాలు

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్‌ గ్రౌండ్‌లో ఆదివారం తీజ్‌ కమిటీ ఆధ్వర్యంలో బంజారాల సంస్కృతికి అద్దం పట్టే తీజ్‌ ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ఈసందర్భంగా మహా భోగ్‌ బండార్‌, పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు మొలకెత్తిన (నవరాత్రులు) జవారాలను మహిళలు తలపై మోసుకెళ్లి, అమ్మవార్లకు భక్తితో సమర్పించారు. అనంతరం ప్రజలు భోగ్‌ బండార్‌ను తిలకించి, ప్రసాదం స్వీకరించారు. ఊరేగింపులో మహిళలు, యువతులు బంజారా సంప్రదాయ వస్త్రధారణలో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. బంజార ప్రజలు, నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

తండాల్లో ఘనంగా తీజ్‌

డిచ్‌పల్లి/ నిజామాబాద్‌ రూరల్‌: డిచ్‌పల్లి మండలంలోని సాంపల్లి మేలయ తండాలో ఆదివారం తీజ్‌ వేడుకలను బంజారాలు ఘనంగా నిర్వహించారు. పెళ్లికాని యువతులు, మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. కార్యక్రమంలో తండాపెద్దలు పాల్గొన్నారు. మోపాల్‌ మండలంలోని కులాస్‌పూర్‌ తండాలో తీజ్‌ వేడుకలను తండా వాసులు ఘనంగా నిర్వహించారు. తండా నాయకులు బాలు నా యక్‌, శీను నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement