మొక్కలు అందిస్తూ.. అవగాహన కల్పిస్తూ.. | - | Sakshi
Sakshi News home page

మొక్కలు అందిస్తూ.. అవగాహన కల్పిస్తూ..

Aug 24 2026 1:31 AM | Updated on Aug 24 2026 1:31 AM

ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలో

పచ్చదనం పెంచే లక్ష్యం

ప్రతి ఇంటికి రెండు మొక్కల పంపిణీ

ఆర్మూర్‌టౌన్‌: ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమం ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలో విజయవంతంగా చేపట్టేందుకు పాలకవర్గం ముందుకు సాగుతోంది. ఆర్మూర్‌ మున్సిపల్‌లో పర్యావరణ సంరక్షణ, హరితహారం లక్ష్యాల సాధనకు మున్సిపల్‌ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి ప్రారంభించారు. మున్సిపల్‌ పరిధిలోని 36 వా ర్డుల్లో ఇంటింటికి రెండు చొప్పున మొక్కలను ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ గోనెల లహరి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి రాజు, స్థానిక వార్డు కౌన్సిలర్లతో కలిసి ప్రజలకు అందించారు. మొక్కలు నాటి సంరక్షించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఆర్మూర్‌ మున్సిపల్‌కు రెండు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇప్పటి వరకు సుమారు 40 వేల మొక్కలు నాటామని మున్సిపల్‌ అధికారులు తెలిపారు. పండ్ల మొక్కలు, నీడనిచ్చే వేప, కానుగ, అల్లనేరేడు వంటి స్థానిక జాతు ల మొక్కలను ప్రజల అభిరుచి మేరకు అందజేస్తున్నారు. వాటిని సంరక్షించే బాధ్యత, రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే ప్రతి ఒక్క రూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని ప్రజ లకు సూచిస్తున్నారు. మున్సిపల్‌ పరిధిలోని కాలనీలు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలు, ఖాళీ స్థలాల్లో విస్తృతంగా మొక్క లు నాటుతున్నారు. దీంతో ఆర్మూర్‌ వీధులు, పాఠ శా ల ప్రాంగణాలు ఆకుపచ్చగా మారేందుకు వి శేషంగా కృషి చేస్తున్నారు. వనమహత్సోవానికి జనరల్‌ ఫండ్‌ నుంచి రూ. ఐదు లక్షల నిధులు కేటాయించారు. టెండర్‌ ద్వారా, ఫారెస్ట్‌ శాఖ నుంచి మొక్క లు తీసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు.

ప్రత్యేక చర్యలు చేపట్టాం

వనమహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నాం. నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలకు నాటి సంరక్షించాలి. మున్సిపల్‌ పరిధిలోని 36 వార్డుల్లో ఇంటింటికి రెండు మొక్కలను అందిస్తున్నాం.

– ఽశ్రీహరిరాజు, మున్సిపల్‌ కమిషనర్‌

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిని పచ్చదనంతో కళకళలాడించడమే మా లక్ష్యం. మున్సిప ల్‌ ఆధ్వర్యంలో అందిస్తున్న రెండు మొక్కలను ప్రతి ఒక్కరూ నాటి, వాటిని సంరక్షించాలి. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే మనం మొక్కలు నాటాలి. చెట్లు ఉంటేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.

– గోనె లహరిరఘు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement