మాక్లూర్: పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఆదివారం జిల్లా కేంద్రంలో ఆలూర్ మండలం కల్లెడి గ్రామ కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. నాయకులు దేగ పోశెట్టి, గంగారాం, నీలగిరి శ్రీనివాస్, మహేశ్, కార్యకర్తలు ఉన్నారు.
కోటగిరిలో వైద్య శిబిరం
రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో రామకృష్ణ మఠం హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. శిబిరంలో 528 మంది రోగులకు వివిధ విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బర్ల మధుకర్, కోనేరు శశాంక్, రామకృష్ణ మఠం గ్రామశ్రీ సేవల కోఆర్డినేటర్ వేణు, కోటగిరి రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు గోగినేని శివశ్రీనివాస్, సభ్యులు హన్మంత్‌రావు, నితిన్‌చంద్ర, తోట శ్రీకాంత్, గర్దాస్ గంగాధర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణ పనులకు సహకారం
రెంజల్: రెంజల్‌లో పునర్నిర్మాణం చేపడు తున్న విఠలేశ్వర్ ఆలయ పనులకు గ్రామంలో దాతలు విరాళాలను అందిస్తున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు దాతలను సత్కరిస్తున్నారు. ఆదివారం గ్రామంలో విరాళాల సేకరణకు స్పందన లభించింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు అమ్రాది శేఖర్, ప్రతినిధులు అరవింద్‌రెడ్డి, తగిలేపల్లి పండరి రెడ్డి, భూంరెడ్డి, వేణు, ఇందిరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏకచక్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు
బోధన్‌రూరల్: శ్రావణమాసాన్ని పురష్కరించుకుని పట్టణంలోని ఏకచక్రేశ్వర శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధికసంఖ్యలో ఆలయంలోని ప్రత్యేకాభిషేకా లు, పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ అర్చకులు గణేశ్ మహరాజ్, మహే శ్ పఠాక్, శివ కుమార్, పట్టణ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.


