ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో ఆదివారం సర్వసమాజ్ ప్రజాఐక్య సమితి ఆధ్వర్యంలో జెండా జాతరను ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్‌తో పాటు చుట్టుపక్కల ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి జెండాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరిరఘు కుటుంబ సమేతంగా, ఈఆర్ ఫౌండేషన్ ఈర వత్రి రాజశేఖర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సర్వసమాజ్ అధ్యక్షుడు కొట్టల సుమన్ అ న్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం సర్వసమాజ్ సభ్యులు జెండాను ప్రతి ఏడాది లాగే ఆర్మూర్ శివారులోని అంకాపూర్ గ్రామస్తులకు అందజేశారు. ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును నిర్వహించారు. కార్యక్రమంలో సర్వసమాజ్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


