సుభాష్‌నగర్: నిజామాబాద్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్‌కు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి శనివారం భూమిపూజ చేశారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌న్‌పాల్ సూర్యనారాయణ, తాహెర్‌బీన్ హందాన్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు చంద్రశేఖర్ గౌడ్, కవితారెడ్డి, మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, బొబ్బిలి రామకృష్ణ, కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్, ఐఎంఏ అధ్యక్షుడు విశాల్ ఆకుల, ప్రధానకార్యదర్శి హరీష్ స్వామి, కార్పొరేటర్లు, వైద్యులు, ఐఎంఏ ప్రతినిధులు పాల్గొన్నారు.


