తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న పీజీ 2వ, ఐఎంబీఏ 8వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలకు 132 మంది గైర్హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ శనివారం తెలిపారు.పరీక్షలకు మొత్తం 2,009 మంది వి ద్యార్థులకు గానూ 1,877 మంది హాజరు కాగా 132 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.
డిచ్‌పల్లి: ఫిలిప్పీన్స్ దేశ పర్యటన ముగించుకుని శనివారం జిల్లాకు వచ్చిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డికి డిచ్‌పల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. డిచ్‌పల్లి నాగ్‌పూర్ గేట్ వద్ద పార్టీ మండల అధ్యక్షుడు అంబర్‌సింగ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ రాంచందర్‌గౌడ్, సర్పంచ్ విజయ్ చౌహాన్ తదితరులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించారు.
జక్రాన్‌పల్లి: జిల్లా కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి మెమోరాండం సమ ర్పించడానికి వెళ్లిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, పార్టీ నాయకులను పోలీసు లు అరెస్ట్ చేయడం సరైంది కాదని పార్టీ మండల అధ్యక్షుడు కన్నెపల్లి ప్రసాద్ అన్నారు. శని వారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భూభారతిలో తీసుకొచ్చిన భూముల జాబితాలో దొర్లిన తప్పిదాలను సరి చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన బీజే పీ నాయకులను అరెస్ట్‌లు చేయడం శోచనీయమన్నారు.
సిరికొండ: మండలంలోని గోప్య తండా గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సర్పంచ్ బుక్యా మంజులసంతోష్‌నాయక్ తెలిపారు. చైర్మన్‌గా బుక్యా పరశురాం, వైస్ చైర్మన్‌గా హైదర్ బడే ఎన్నికయ్యారు. ఉప సర్పంచ్ రమేశ్, వార్డు సభ్యులు వినోద్‌కుమార్, మాజీ సర్పంచ్ రాంచందర్, తండావాసులు రాములు, శివరాం, సుమన్, హైదర్, బన్నాజీ, అంబర్‌లాల్, గజన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
● అనుమతించని అధికారులు
నిజామాబాద్ రూరల్: గూపన్‌పల్లి శివారులో అభివృద్ధి పనుల ప్రారంభమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ శనివారం వచ్చారు. ఇళ్లు లేని తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ ఆర్టీసీ కాలనీవాసులు మంత్రి వద్దకు వస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. అధికారుల తీరుపై స్థానిక కార్పొరేటర్ చింత ప్రసునశ్రీనివాస్‌రెడ్డి, కాలనీవాసులు అసహ నం వ్యక్తం చేశారు.


