మంత్రిని కలిసిన నాయకులు | - | Sakshi
Sakshi News home page

మంత్రిని కలిసిన నాయకులు

Aug 23 2026 2:04 AM | Updated on Aug 23 2026 2:04 AM

మంత్రిని కలిసిన నాయకులు మంత్రిని కలిసిన కలెక్టర్‌, సీపీ పోస్టర్‌ ఆవిష్కరణ ఉచిత వైద్య శిబిరం

డిచ్‌పల్లి: జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్‌ శివారులోని కృష్ణ కాంటినెంటల్‌ హోటల్‌లో కొద్దిసేపు బస చేశారు. ఆయన వెంట రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి ఉన్నారు. మంత్రి శ్రీనివాస్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన డీసీసీ ఉపాధ్యక్షుడు అమృతాపూర్‌ గంగాధర్‌ శాలువాతో సత్కరించారు.

జక్రాన్‌పల్లి: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని నిజామాబాద్‌ రూరల్‌ యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు సొప్పరి వినోద్‌ డిచ్‌పల్లి మండలం ధర్మారంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

నిజామాబాద్‌అర్బన్‌: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కేంద్రానికి రావడంతో రెవెన్యూ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమణ్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. నాయకులు ప్రశాంత్‌, శ్రీనివాసరావు, బాలరాజు ఉన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చారు. ప్రయివేటు హోటల్లో రాత్రి బస చేశారు. అంతకుముందు కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా, పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్యమంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని సీఐటీ యూ కార్యాలయంలో ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 24న నిర్వహించే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు సంబంధించిన పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. నాయకులు ఏ రమేశ్‌ బాబు, ఉద్ధవ్‌, అబ్దుల్‌, వసీం, సాహెబ్‌ పాల్గొన్నారు.

సిరికొండ: మండలంలోని గోప్యానాయక్‌ తండాలో సిరికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని సర్పంచ్‌ మాలావత్‌ సుబ్బరవినాయక్‌ ప్రారంభించారు. ఉపసర్పంచ్‌ బంకట్‌లాల్‌, జీపీ కార్యదర్శి సుమన్‌, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు, మాజీ సర్పంచ్‌ శంకర్‌లాల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement