ఆర్మూర్‌టౌన్: యూరియా అందకపోవడంతో మొక్కజొన్న పంట ఎర్రబారి దెబ్బతింటోందని, గ త కొన్ని రోజులుగా యూరియా కొరత ఎదుర్కొంటున్నామని ఆర్మూర్ పట్టణ పరిధిలోని రైతులు శనివారం నిజాంసాగర్ కెనాల్‌పై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంటలను కాపాడేందుకు తక్షణమే సొసైటీ ద్వారా యూరియా అందజేయాలన్నారు. యాప్‌లో ఆర్మూ ర్ పేరు, సర్వే నంబర్లు, ఆధార్ కార్డు నంబర్లు చూపించకపోవడంతో పట్టణ పరిధిలోని తమకు యూరియా పంపిణీలో జాప్యం జరుగుతోందని, రైతు సంఘాల ప్రతినిధులు గత 10 రోజులుగా అధికారులకు విన్నవిస్తున్నా, ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పరిష్కారం కావడం లేదన్నారు. యాప్‌కు సంబంధం లేకుండా తమకు అవసరమైన మేర యూరియా అందించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. అనంతరం రైతు ల ధర్నాను విరమించి సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మా ల్వియా వద్దకు వెళ్లి సమస్యను వివరించారు. ధర్నా కారణంగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ సిబ్బందితో కలిసి క్లియర్ చేశారు.


