● ఇప్పటికే 25 కేసులు నమోదు
● అప్రమత్తమైన వైద్యాధికారులు
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ డివిజన్‌లోని గ్రామాలతోపాటు పట్టణంలో డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. పట్టణంతో పాటు డివిజన్ మొత్తంలో అధికారికంగా ఇప్పటికే 25 కేసులు నమోదు అయ్యాయి. రెంజల్, రుద్రూర్, పోతంగల్ మండలలతో పాటు ఇతర మండలాల్లో 19 కేసులు, పట్టణంలోని శక్కర్‌నగర్, రాకాసీపేట్, ఆటోనగర్, పాండుఫారంతోపాటు ఇతర కాలనీల్లో 6 డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు గ్రామాలతోపాటు పట్టణంలో సర్వేలు నిర్వహించి, వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలతోపాటు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, దోమల బెడద గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణంలోఽ అధికమయింది. పారిశుద్ధ్య నిర్వహణ లోపం వల్ల అనేక మంది ప్రజలు విషజ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. అయినా పారిశుద్ధ్యంపై సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కొత్తపల్లిలో ఒకరికి..
రుద్రూర్: కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో డెంగీ పాజిటివ్ కేసు నమోదైంది. గ్రామానికి చెందిన ఓ యువకుడికి డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమై, దోమల నివారణ చర్యలు చేపట్టారు. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు.


