పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రి
సాక్షి నెట్‌వర్క్: జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం పాములబస్తీలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులతో మాట్లాడారు. అలాగే కలెక్టరేట్ వెనుక భాగంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించి తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రూరల్ తహసీల్ కార్యాలయాన్ని అధికారులతో కలిసి ప్రారంభించారు. పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు మంత్రిని కలిసి సమస్యలను విన్నవించారు. రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


