నిజామాబాద్ రూరల్: యువత భవిష్యత్తును కాపాడేందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తపన పడుతున్నారని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ అన్నారు. శనివారం విఫుల్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో నిర్వహించిన ‘ఛాత్రోన్ గూంజ్’ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పుణేలో నిర్వహించిన ‘ఛాత్రోన్ గూంజ్’’ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి, మేయర్ ఉమారాణి, రామకృష్ణ, తాహెర్ బిన్ హందాన్, శేఖర్ గౌడ్, పీపీ దయాకర్ గౌడ్, మనాల మోహన్ రెడ్డి, నరాల రత్నాకర్, మజీద్ ఖాన్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


