గద్దలకు వైద్యం | - | Sakshi
Sakshi News home page

గద్దలకు వైద్యం

Aug 22 2026 1:47 AM | Updated on Aug 22 2026 1:47 AM

గద్దలకు వైద్యం యూరియా అక్రమ నిల్వలు సీజ్‌

లింగంపేట: మండ ల కేంద్రంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రెండు గద్దలకు వెట ర్నరీ వై ద్యుడు ఎ జాజ్‌ చికిత్స అందించారు.వివరాలి లా ఉన్నాయి. రైతు వేది క సమీపంలో శుక్రవారం రెండు గద్దలు ఎక్కడి నుంచో వచ్చి ప్రాణాపాయస్థితిలో ఉండటాన్ని సిబ్బంది గమనించారు. వారు వెటర్నరీ వైద్యుడు ఎజాజ్‌కు సమాచారం అందించగా చికిత్స చేశారు. ప్రస్తుతం ఒకటి కోలుకుంటోందని, మరొకటి సీరియస్‌గా ఉందని ఆయన తెలిపారు.

లింగంపేట: మండల కేంద్రంలోని సబ్‌ స్టేషన్‌ సమీపంలోని ఫెస్టిసైడ్‌ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన యూరియాను సీజ్‌ చేసినట్లు ఏడీఏ సుధామాధురి తెలిపారు. శుక్రవారం లింగంపేట నుంచి ముంబోజిపేటకు వెళ్తుండగా సబ్‌స్టేషన్‌ సమీపంలోని ఓ ఫెస్టిసైడ్‌ దుకాణంలో బులెరో వాహనం నుంచి యూరియాను దించుతుండగా అనుమానం వచ్చి దుకాణంలోకి వెళ్లి చూడగా 50 బస్తాల యూరియా దుకాణంలో నిల్వ ఉన్నట్లు గమనించారు. విషయాన్ని స్థానిక ఎస్సై దీపక్‌కుమార్‌, మండల వ్యవసాయాధికారి అనిల్‌కుమార్‌ కు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకొని పరిశీలించారు. దుకాణ యజమానిని విచారించగా ఎలాంటి బిల్లులు లేకుండా యూరియా నిల్వ చేసినట్లు తేలింది. దీంతో యూరియా స్టాక్‌ను సీజ్‌ చేసి తదుపరి చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement