వర్ని: జాకోర క్రాస్ రోడ్డు వద్ద అక్రమంగా నిర్మా ణం చేపడుతున్న కమాన్(స్వాగత తోరణం) నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ విషయమై వినతిపత్రాన్ని వర్ని తహసీల్దార్ ప్రశాంత్ కుమార్‌కు అందజేశారు. జాకోరా చౌరస్తా వద్ద ఆర్ అండ్‌బీ రోడ్డు పరిధిలో బడా పహాడ్ దర్గాకు సంబంధించిన కమాన్ నిర్మాణం చేపడుతున్నారని, 14 కిలోమీటర్ల దూరంలో దర్గా ఉండగా ఇక్కడ నిర్మాణం ఎలా చేపడతారని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. జలాల్పూర్ గ్రామం వద్ద గతంలో కమాన్ నిర్మాణం చేపట్టారని అయినా వర్ని వద్ద మరో నిర్మాణం ఎలా చేపడతారని ఆయన ప్రశ్నించారు. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టి ఇందులో హిందువుల మనోభావాలు దెబ్బతీసి మతవిద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు ఆవుల రమేష్, పటేల్ ప్రసాద్, మురళి, సురేష్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.


