● ప్రభుత్వ సలహాదారు శ్రీనివాస్‌రెడ్డి
వర్ని: మండలంలోని జాకోరా క్రాస్ రోడ్డు వద్ద నిర్మాణం చేపడుతున్న బడాపహాడ్ కమాన్ నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని ప్రభుత్వ వ్యవ సాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. శుక్రవారం కమాన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రధాన రహదారిపై నిర్మాణం చేపడుతున్నందున పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. వర్ని మాజీ కోఆప్షన్ సభ్యులు కరీం, నాయకులు ఉన్నారు.
విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలి
కళాశాలలో చదువుకునే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా చూడాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. చందూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించే మహాత్మ జ్యోతీబా ఫూలే మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు భవనాన్ని పరిశీలించారు. కళాశాల ప్రారంభించిన తర్వాత విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేశ్ బాబా, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, పీసీసీ డెలిగేట్ రాజిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోపాల్, సర్పంచులు ఉమా సంజీవ్, లాల్ సింగ్, సొసైటీ చైర్మన్ అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతరాజు శ్రీనివాస్ ఉన్నారు.


