రెంజల్: రెంజల్‌లో ఇసుక అక్రమ నిల్వల పై ట్రెయినీ కలెక్టర్ సాయి సురేశ్ విచారణ చేపట్టారు. శుక్రవారం రెంజల్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో, తహసీల్దార్, బోధన్ డీఎల్‌పీవోలతో ప్రత్యేకంగా సమావేశమ్యారు. ఈ నెల 3వ తేదీన పలువురు వార్డు సభ్యులు, స్థానిక యువకులు రెంజల్‌లో ఇసుక అక్రమంగా నిల్వలు ఉన్నట్లు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ జిల్లా మైనింగ్ అధికారులను పంపించి అదే రోజు సుమారు 35 ట్రాక్టర్ల ఇసుక అక్రమ నిల్వలను గుర్తించి సీజ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుకను పక్కదారి పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో ట్రెయినీ కలెక్టర్ అధికారులు తీరు పై ఆరా తీశారు. విచారణ నివేదికను కలెక్టర్‌కు అందించి ఇసుకకు అనుమతులు అందించిన సంబంధింత అధికారులకు షోకాజ్ నోటీసులను అందించే అవకాశం ఉంది. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయి అధికారులు సమన్వయంతో పని చేసి ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. అనంతరం తహసీల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఆయన వెంట ఎంపీడీవో కమలాకర్, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, బోధన్ డీఎల్‌పీవో నాగరాజు, రెంజల్ జీపీ కార్యదర్శి రాజేందర్‌రావు ఉన్నారు.


