పడకల్‌లో చోరీ | - | Sakshi
Sakshi News home page

పడకల్‌లో చోరీ

Aug 22 2026 1:47 AM | Updated on Aug 22 2026 1:47 AM

జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్‌లో గురువారం రాత్రి తాళాలు వేసిన ఇళ్లలో చోరీ జరిగింది. ఎస్సై మహేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని లక్ష్మీ నర్సింహ కిరాణ జనరల్‌ స్టోర్‌లో దుండగులు అర్ధరాత్రి చోరీకి పాల్పడి కౌంటర్‌లో ఉన్న రూ. లక్ష నగదును ఎత్తుకెళ్లారు. అలాగే షాప్‌నకు సమీపంలో ఉన్న చింతలపల్లి గంగారెడ్డి ఇంట్లో చోరీకి యత్నించారు. ఎలాంటి వస్తువులు చోరీకి గురికాలేదు. దుకాణ యజమాని నరేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

బంగారు గాజులు ..

నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని కంఠేశ్వర్‌ ప్రాంతంలో ఉంటున్న ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు మూడో టౌన్‌ ఎస్సై హరిబాబు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. వృద్ధురాలైన గడ్డం సుశీల శుక్రవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గుర్తించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇందులో ఆమె చేతికి ఉన్న ఆరు బంగారు గాజులను లాక్కొని పరారయ్యారు. తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు వృద్ధురాలి కుమారుడు చిట్టిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement