సేవా కార్యక్రమాలతో సామాజిక బాధ్యత పెరుగుతుంది | - | Sakshi
Sakshi News home page

సేవా కార్యక్రమాలతో సామాజిక బాధ్యత పెరుగుతుంది

Aug 19 2026 1:30 AM | Updated on Aug 19 2026 1:30 AM

డిచ్‌పల్లి : సేవా కార్యక్రమాల ద్వారా మానవత్వం, సామాజిక బాధ్యత పెంపొందుతాయని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ ఏడవ బెటాలియన్‌ (డిచ్‌పల్లి) బి– కంపెనీ అధికారులు పేర్కొన్నారు. బి– కంపెనీ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోని మానవతాసదన్‌ను సందర్శించారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పండ్లు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీ కంపెనీ అధికారులు మాట్లాడుతూ.. సమాజంలో వెనుకబడిన వారికి చేయూతనందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అధికారులు మనోహర్‌, శ్రీనివాస్‌, ప్రమోద్‌ కుమార్‌, సిబ్బంది, ఎంఈవో నరేష్‌, మానవతాసదన్‌ లైజనింగ్‌ అధికారి సుధాకర్‌రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement