ఇందూరు యువత సేవలు అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

ఇందూరు యువత సేవలు అభినందనీయం

Aug 19 2026 1:30 AM | Updated on Aug 19 2026 1:30 AM

నగర మేయర్‌ కూరగాయల ఉమారాణి

నిజామాబాద్‌ రూరల్‌: సమాజ సేవ కోసం కృషి చే స్తున్న ఇందూరు యువత సేవలు అభినందనీయ మని మేయర్‌ ఉమారాణి అన్నారు. నగరంలోని రా జీవ్‌ గాంధీ ఆడిటోరియంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సేవాస్ఫూర్తి అవార్డ్స్‌–2026 కార్యక్రమం నిర్వహించారు. మేయర్‌ ఉమారాణి, నిజామాబాద్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ బీ ప్రకాశ్‌ జ్యోతి ప్రజ్వల న చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేయర్‌ మాట్లాడుతూ.. తమ కోసం కాకుండా సమాజం కో సం జీవించే సేవామూర్తులను గుర్తించి గౌరవించ డం ఎంతో గొప్ప విషయమని అన్నారు. సేవ అనే ది కేవలం ఒక కార్యక్రమం కాదని, సమాజంపై ఉ న్న మన బాధ్యత అని అన్నారు. ఏసీపీ ప్రకాశ్‌ మా ట్లాడుతూ.. యువతలో సేవాభావం, సామాజిక బాధ్యత మరింత బలపడితే సమాజంలో ఎన్నో సా నుకూల మార్పులు సాధ్యమవుతాయని అన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థా పక అధ్యక్షుడు మద్దుకురి సాయిబాబు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే త మ సంస్థ లక్ష్యమని తెలిపారు. 30 మందికి సేవా మూర్తులకు అవార్డులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించా యి. కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి వాల బాలకిషన్‌, మద్ది గంగాధర్‌, రచర్ల రాజేశ్‌, శర్మ,కొండా, నాగేందర్‌, సుజాత, దారం గంగాధర్‌, పుష్పవతి, సుధాకర్‌, సంస్థ సభ్యులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement