ప్రమాదంలో ప్రాణం | - | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో ప్రాణం

Aug 14 2026 8:02 AM | Updated on Aug 14 2026 8:02 AM

నిజామాబాద్‌అర్బన్‌ : జిల్లా మీదుగా 44, 63వ నంబర్‌ జాతీయ రహదారులు వెళ్తుండగా.. ఆయా ప్రాంతాల్లో 26 బ్లాక్‌ స్పాట్‌లు ఉన్నాయి. ఈ ఏడాది జూలై 30వ తేదీ వరకు జిల్లాలో 63 రోడ్డు ప్ర మాదాలు చోటు చేసుకోగా.. 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 42 మంది గాయాలపాలయ్యారు. జిల్లాలోని ఆయా రోడ్లపై గతేడాది 780రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా, 276 మంది మృతి చెందారు. వీరిలో 83 మంది హైవేలపై ప్రాణాలు కోల్పోగా, 193 మంది రాష్ట్ర, అంతర్గత రోడ్లపై మరణించారు. 715 మంది గాయపడ్డారు. జాతీయ రహదారుల వెంబడి 223 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సంబంధిత అధికారులు గుర్తించిన బ్లాక్‌ స్పాట్‌లలోనే కాకుండా గ్రామీణ ప్రాంత రోడ్లపైనా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మూలమలుపులు, జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లపైకి నేరుగా దూసుకురావడం వంటి కారణాలతో తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల డిచ్‌పల్లి వద్ద చోటు చేసుకున్న రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు యువకులు మృతి చెందారు. రుద్రూర్‌ వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యయి. డిచ్‌పల్లి వద్ద హైవేపై ప్రైవేట్‌ బస్సు బోల్తా పడగా నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యయి. శుక్రవారం బడాపహాడ్‌ వద్ద బస్సు బోల్తా పడడంతో పలువురికి గాయాలయ్యయి. ఇందల్వాయి వద్ద జాతీయ రహదారిపై ఆపి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి, అలాగే జక్రాన్‌పల్లి మండలం పడకల్‌ వద్ద ట్రాక్టర్‌ను కంటైనర్‌ వెనకాల నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఇలా రోజూ ఏదో ఓ చోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా నేషనల్‌ హైవే 44 వెంబడి డిచ్‌పల్లి సీఎంసీ వద్ద, ఇందల్వాయి, గన్నారం, పెర్కిట్‌, బాల్కొండ చిట్టాపూర్‌ , జక్రాన్‌పల్లి మండలం పడకల్‌, డిచ్‌పల్లి పోలీస్‌ బెటాలియన్‌ తదితర ప్రాంతాల్లో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, బోధన్‌, నందిపేట్‌, మల్లారంగండి, ఆర్మూర్‌, డిచ్‌పల్లి రోడ్లపై ఏదో ఒక ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంది.

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసు శా ఖ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమా లు నిర్వహిస్తున్నా ఫలితం కనిపించడం లేదు! వా హనదారులు ఎవరివారు రోడ్డు నిబంధనలను పా టించాలనే స్పృహ కలిగి ఉంటేనే రోడ్డు ప్రమాదాల ను అరికట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆందోళనకు గురిచేస్తున్న రోడ్డు ప్రమాదాలు

అతివేగం.. అవగాహనా రాహిత్యం

హైవేలతోపాటు అంతర్గత రోడ్లపై

యాక్సిడెంట్‌లు

అవగాహన కల్పిస్తున్నా

కనిపించని ఫలితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement