డొంకేశ్వర్(ఆర్మూర్): దివ్యాంగులకు వైకల్య శాతాన్ని నిర్ధారించేందుకు అధికారులు ప్రతి నెలా నిర్వహించే సదరం క్యాంపుల సంఖ్య ను పెంచారు. ఇదివరకు నెలకు రెండు సార్లు మాత్రమే నిర్వహించే క్యాంపులను ఈ నెల లో ఆరుకు పెంచినట్లు ఐకేపీ పింఛన్ల విభా గం డీపీఎం రాజేశ్వర్ గురువారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్‌లకు దరఖాస్తులు తీసుకుంటున్న నేపథ్యంలో స దరం సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్న ట్లు వెల్లడించారు. సదరం క్యాంపుల కోసం జిల్లా వ్యాప్తంగా 1,500మంది వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకుని వేచి ఉన్నారని, వారి కోసం రానున్న పక్షం రోజుల్లో క్యాంపులు నిర్వహిస్తామన్నారు. వికలాంగత్వ నిర్ధారణ ధ్రువపత్రాలు నిర్ణీత సమయానికి అందజేస్తామని, అర్హులైన దివ్యాంగులు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సదరం క్యాంపుల సమాచారం మొబైల్ ఫోన్లకు వస్తుందని, సూచించిన తేదీల్లో క్యాంపునకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఖలీల్‌వాడి : జిల్లా విద్యాశాఖ పరిధిలోని స మగ్ర శిక్ష, డీపీవోలో ప్లానింగ్ కో ఆర్డినేటర్, క్వాలిటీ కో ఆర్డినేటర్, జెండర్ ఈక్విటీ కో ఆ ర్డినేటర్, ఐఈ, సీఎంవో, మీడియా–ఓఎస్సీ, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కో ఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు డీఈవో పార్శి అశోక్ గురువారం తెలిపారు. ప్రభుత్వ, జి ల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన గెజిటెడ్ హెడ్ మాస్ట ర్లు, స్కూల్ అసిస్టెంట్ల నుంచి ఆన్‌లైన్‌లో ద రఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్దేశిత అర్హతలు, ఇతర అర్హత ప్రమాణాల ను పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాల కోసం www.sch ooledu.telangana.gov.inను సంప్రదించాలని సూచించారు.
ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యవర్గ
సభ్యుడిగా రఘురాం
ఖలీల్‌వాడి : అఖిల భా రత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉ మ్మడి జిల్లాకు చెందిన బానోత్ రఘురాంనాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంస్థ 90 వ వార్షికోత్సవాలను ఈ నెల 12, 13 తేదీల్లో ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నుకున్న జా తీయ కార్యవర్గంలో రఘురాంకు చోటుదక్కింది. బాన్సువాడ మండలం రాంపూర్‌తండాకు చెందిన రఘురాం ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర స హాయ కార్యదర్శిగా విద్యార్థి ఉద్యమాల్లో క్రి యాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా రఘురాం జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వి ద్యార్థుల అభివృద్ధి, ప్రభుత్వ విద్యారంగ బలోపేతమే లక్ష్యంగా పోరాటం కొనసాగుతుందన్నారు.
ఇద్దరు టీచర్లకు
షోకాజ్ నోటీసులు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రార్థన సమయానికి హాజరుకాని ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. సదాశివనగర్ మండలం ధర్మారావ్‌పేట్ ఉన్నత పాఠశాలను ఈ నెల 7న స్థానిక సర్పంచ్ ఉమర్ తనిఖీ చేయగా, ప్రార్థన సమయంలో ఇద్దరు ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారు. ఈ విషయమై ఎంఈవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఉపాధ్యాయులకు గురువారం షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు ఎంఈవో యోసెఫ్ తెలిపారు.


