న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2026
● ముప్కాల్ మండలం వేంపల్లి గ్రామ శివారులోని శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ వరద కాలువలో వ్యాన్ బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘ టన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. సా నిటరీ పైపుల లోడ్‌తో హైదరాబాద్ వైపు వెళ్తున్న వ్యా న్ 44 నంబరు జాతీయ రహదారిపై వంతెనను ఢీకొ ట్టి కాలువలో పడిపోయింది. సమాచారం అందుకు న్న పోలీసులు వెంటనే రెస్క్యూ టీమును రప్పించి వ్యాన్‌ను వరద కాలువ నుంచి బయటకు తీయించా రు. చాలా సేపు గాలించిన తర్వాత మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్‌కు చెందిన డ్రైవర్ సుధాం మృతదేహం లభించింది. – వేల్పూర్(ముప్కాల్)
● ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన వారు రెండు టూరిస్ట్ బస్సుల్లో హైదరాబాద్ వెళ్తుండగా.. ఒక బ స్సు పంక్చర్ అయ్యింది. దీంతో రెండు బస్సులను ఒక దాని వెనకాల ఒకదానిని నిలిపివేశారు. ఒక బస్సు లోని టూరిస్టులు కిందికి దిగి డివైడర్‌పై కూర్చు న్నారు. కొంతసేపటికి వేగంగా దూసుకొచ్చిన ట్రక్.. బస్సును వెనుక నుంచి ఢీకొట్టడంతో బస్సు డివైడర్‌పై కూర్చున్న వారిపైకి దూసుకెళ్లింది. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. – ఆర్మూర్ టౌన్


