● నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
● నగరంలో జాతీయ జెండాల పంపిణీ
సుభాష్‌నగర్: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ప్రతిఒక్కరు త్రివర్ణ పతాకాలను తమ ఇంటిపై ఎగు రవేసి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. బుధవారం నగరంలోని గాంధీచౌక్‌లో ఆయన త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రధాని మోడీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. ఈనెల 14న నగరంలో నిర్వహించే హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరా రు. నాగోళ్ల లక్ష్మీనారాయణ, న్యాలం సునీత రాజు, బెల్లాల్ శశాంక్, ఎర్రం సుధీర్, బంటు రాము, బంటు ప్రీతి, శ్యామల, మల్కాయి మహేందర్, బొబ్బి లి వేణు, ఇప్పకాయల కిషోర్, మురళి, నాయకులు పురుషోత్తం, ఆమంద్ విజయ్ పాల్గొన్నారు.
‘వందేమాతరం’ దేశభక్తులను తయారు చేసింది
నిజామాబాద్ రూరల్: వందేమాతరం గేయం దేశభక్తులను తయారు చేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో 150 వసంతాల వందేమాతరం గీత వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, డ్రాయింగ్, నృత్య ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు.


