● డీఐఈవో తిరుమలపుడి రవికుమార్
ఖలీల్‌వాడి: ప్రతి అధ్యాపకుడు విద్యార్థులను భావితరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్లకు కొనసాగుతున్న శిక్షణా తరగతులను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. అధ్యాపకులు, విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సాంకేతికపరమైన పరిజ్ఞానంతో విద్యా బోధన చేసేందుకు శిక్షణ పొందడం, పేద విద్యార్థుల అభ్యున్నతికి నిదర్శమని అన్నారు. పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ.. రెండు రోజుల ఓరియంటేషన్ తరగతులు తమ వత్తి నైపుణ్యాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బుద్ధిరాజ్, అబ్జర్వర్ ధర్మపాల్, జిల్లా ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు నర్సయ్య, అధ్యాపకులు ప్రసాద్, యమున, శివరాజ్, లావణ్య, విజయ, భోజరం, బాలాజీ తదిరులు పాల్గొన్నారు.


