భూముల రీసర్వేకు పట్టాదారులు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

భూముల రీసర్వేకు పట్టాదారులు సహకరించాలి

Aug 8 2026 1:17 AM | Updated on Aug 8 2026 1:17 AM

భూముల రీసర్వేకు పట్టాదారులు సహకరించాలి పీజీ పరీక్షలకు 64 మంది గైర్హాజరు కొనసాగుతున్న బీటెక్‌ పరీక్షలు పది మంది హెడ్‌ కానిస్టేబుళ్లకు పదోన్నతి 14న సామూహిక తీజ్‌

వేల్పూర్‌(బాల్కొండ): భూముల రీ సర్వేకు పట్టాదారులు సహకరించాలని ఆర్మూర్‌ డివిజన్‌ సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియా పేర్కొన్నారు. బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌ గ్రామంలో చేపట్టిన భూముల రీ సర్వే కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. భూముల రీసర్వేకు పట్టాదారులు అందుబాటులో ఉండి సహకరించాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది సర్వేలో పాల్గొని, ఈనెల 31 లోగా గ్రామాలలో భూముల రీ సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌, డీఐ శేఖర్‌వర్మ, సర్వేయర్‌ శివకుమార్‌, ఆర్‌ఐ గంగాధర్‌, జీపీవోలు ఉన్నారు.

తెయూ(డిచ్‌పల్లి): తెయూ పరిధిలో కొనసాగుతున్న పీజీ 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలకు శుక్రవారం 64 మంది గైర్హాజరైనట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. పరీక్షలకు మొత్తం 2,059 మందికి 1,995 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ బీటెక్‌ సీఎస్‌ఈ, ఏఐ 2వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. పరీక్షలకు 22 మందికి 21 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌: పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పదకొండు మంది హెడ్‌ కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన హెడ్‌ కానిస్టేబుళ్లలో శంకర్‌(ఎడపల్లి), కై లాస్‌పతి(వేల్పూర్‌), బీ చందులాల్‌(ట్రాఫిక్‌ పీఎస్‌),మోజీరామ్‌(ఎన్‌ఐబీ), పాండు(మోపాల్‌), ఏ ముత్తన్న(టాస్క్‌ఫోర్స్‌), బీ రాజు (ఐదో టౌన్‌), లక్ష్మణ్‌ (ట్రాఫిక్‌ పీఎస్‌), జీ శ్రీనివాస్‌(భీమ్‌గల్‌), జీవీ శంకర్‌(వర్ని) ఏఎస్సైలుగా ప దోన్నతి పొందారు. అలాగే కేసీ శర్మ(ఏఆర్‌ హె డ్‌క్వార్టర్స్‌) ఏఆర్‌ఎస్సైగా పదోన్నతి పొందా రు. వీరిని శుక్రవారం పోలీస్‌ కమిషనర్‌ కార్యా లయంలో సీపీ సాయి చైతన్య అభినందించా రు.పోలీసులు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

నిజామాబాద్‌ రూరల్‌: నగరంలో సామూహిక బంజారా తీజ్‌ ఉత్సవాలను ఈ నెల 14 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధికార ప్రతినిధి మోతీలాల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తీజ్‌ బంజారా సమాజం ఐక్యత, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల ప్రభుత్వ, విశ్రాంత, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, ప్రైవేట్‌ ఉద్యోగులు, స్వయం ఉపాధి రంగాలలో పనిచేస్తున్న సోదరులు, యువత, మహిళలు, యావత్‌ బంజారా సమాజం అందరినీ ఒకే వేదికపై సమీకరించి ఉత్సవాలను నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ కట్టుబడి ఉందన్నారు. బంజారాలు ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement