‘సర్‌’ డిజిటలైజేషన్‌ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ డిజిటలైజేషన్‌ వేగవంతం చేయాలి

Jul 30 2026 5:18 AM | Updated on Jul 30 2026 5:18 AM

ఈఆర్వోలు, సూపర్‌వైజర్లు

క్రాస్‌ వెరిఫై చేయాలి

వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

సి సుదర్శన్‌ రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌: ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌)లో భాగంగా ఓటర్ల వివరాల డిజిటలైజేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్ర ధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్‌ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారికి సూచించారు. బీఎల్‌వోలు నమోదు చేసిన వివరాల్లో ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురో గతిపై బుధవారం హైదరాబాద్‌ నుంచి సీఈవో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణకు తుది గడువు సమీపించినందున ఓటర్ల నుంచి సేకరించిన అన్ని ఎన్యూమరేషన్‌ ఫారాలను వెంటనే డిజిటలైజ్‌ చేయాలని ఆదేశించారు. బీఎల్‌వోలు వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసే సమయంలో పొరపాట్ల కారణంగా అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి వాటికి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. బీఎల్‌వోలు నమోదు చేసిన వివరాలను ఈఆర్‌వోలు, సూపర్‌వైజర్లు తప్పనిసరిగా క్రాస్‌ వెరిఫై చేయాలని, లోపాలు ఉంటే రెండు రో జుల్లో సరిదిద్దాలని ఆదేశించారు. అనంతరం కూడా తప్పిదాలు గుర్తిస్తే సంబంధిత బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లపై చర్యలు తీసుకుంటామని సీఈవో స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ ను కూడా సమాంతరంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు ప్రభు త్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధం లేదని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్‌ వి.భుజంగరావు, ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియా, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, విజయలక్ష్మి, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement