చదువుతోనే ఉన్నత స్థానం..
ఆర్మూర్: చదువుతోనే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చంటూ కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణతో నిత్యం బిజీబిజీగా ఉండే కలెక్టర్ కొద్దిసేపు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయురాలి గా మారిపోయి వారిలో ఉత్సాహాన్ని నింపింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించడంలో భాగంగా సోమవారం ఆర్మూర్ పట్ట ణం మామిడిపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఆమె వచ్చారు. 3వ తరగతిలో పలు ప్రశ్నలను విద్యార్థులను అడుగగా, వారు సమాధానా లు చెప్పడంతో చాక్లెట్లను ఇచ్చి ప్రోత్సహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంగ్లీష్‌పై ఇష్టం పెంచుకొని చదవాలని సూచించారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్నాన్ మాల్వియా, ఏసీపీ సత్యనారాయణరెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ ఉన్నారు.


