మేయర్ రేసులో ఉత్తమ ఉపాధ్యాయురాలు
● ఐదు సార్లు అవార్డు అందుకున్న
కాటిపల్లి శమంత
● తన గెలుపుతో పాటు ఇతర డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఐదు సార్లు అవార్డులు సాధించిన కాటిపల్లి శమంత నరేందర్‌రెడ్డి నిజామాబాద్ మేయర్ పీఠం రేసులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 19వ డివిజన్‌లో బరిలోకి దిగిన శమంత నరేందర్‌రెడ్డి నిజామాబాద్ ఉమెన్స్ కళాశాలలో విద్యనభ్యసించారు. 1989 సంవత్సరంలో టీటీసీ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఉపాధ్యాయురాలి గా పనిచేస్తూనే ఉన్నత విద్యనభ్యసించారు. ఉస్మా నియా వర్సిటీ నుంచి ఎంఏ, బీఈడీ పూర్తి చేశారు. తిరుపతిలోని పద్మావతి వర్సిటీ నుంచి మరో పీజీ కోర్సు చేశారు. ఉపాధ్యాయ వృత్తిని శమంతరెడ్డి ని బద్ధతతో నిర్వహించారు. ఈ క్రమంలో శమంత ఐ దు సార్లు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డులు సాధించారు. అదేవిధంగా మహాత్మా జ్యోతిబాపూలే అవార్డు అందుకున్నారు. 2025 మే 24న శమంత ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్డు అయ్యారు. రిటైర్ అయిన తరువాత ఆమె విజయ రూరల్ ఇంజినీరింగ్ కళాశాలకు, వంశీ ఇంటర్‌నేషనల్ హోటల్‌కు డైరక్టర్‌గా వ్యవహరిస్తూ వ్యాపార నిర్వహణలోనూ స త్తా చాటుతున్నారు. శమంతరెడ్డి వద్ద విద్య నేర్చుకు న్న పలువురు విద్యార్థులు యూఎస్‌ఏ, యూరప్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుత నగరపాలక సంస్థ ఎన్నికల్లో త నను గెలిపిస్తే ప్రజలకు శక్తివంచన లేకుండా పూర్తి స్థాయి లో సేవలందజేస్తానని శమంత చెబుతున్నారు.


