విద్యుత్‌, పారిశుద్ధ్యం సమస్యలు తలెత్తకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌, పారిశుద్ధ్యం సమస్యలు తలెత్తకుండా చూడాలి

Feb 10 2026 7:20 AM | Updated on Feb 10 2026 7:20 AM

విద్యుత్‌, పారిశుద్ధ్యం సమస్యలు తలెత్తకుండా చూడాలి

విద్యుత్‌, పారిశుద్ధ్యం సమస్యలు తలెత్తకుండా చూడాలి

అదనపు కలెక్టర్‌ అంకిత్‌

‘రంజాన్‌’ ఏర్పాట్లపై సమీక్ష

నిజామాబాద్‌అర్బన్‌: రంజాన్‌ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యుత్‌, పారిశుధ్యం సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని అ దనపు కలెక్టర్‌ అంకిత్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని తన ఛాంబర్‌లో సోమవారం ఆయన జిల్లా అధికారులతో సమావేశమై, రంజాన్‌ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష జరిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా ఎక్కడ కూడా విద్యుత్‌, తాగునీరు, పా రిశుద్ధ్యం వంటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి బాధ్యతలు పురమాయి స్తూ, నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించా రు. వైద్య శిబిరాలు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కడ కూడా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, డీపీవో శ్రీనివాస్‌రావు, డీఎంహెచ్‌వో రాజశ్రీ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement